Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంనీట్‌ యూజీ ఫలితాలు విడుద‌ల‌

నీట్‌ యూజీ ఫలితాలు విడుద‌ల‌

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ యూజీ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. మే 4న జరిగిన నీట్‌ యూజీ పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు నేడు తుది ఫలితాలను విడుదల చేశారు. ఈ మేరకు పరీక్ష రాసిన అభ్యర్థులు https://neet.nta.nic.in/ వెబ్‌సైట్‌లో పర్సనల్ లాగిన్‌ ద్వారా తమ అప్లికేషన్‌ నంబర్‌, డేట్ ఆఫ్ బర్త్‌ను ఎంటర్‌ చేసి స్కోర్‌ కార్డు పొందాలని అధికారులు సూచించారు. కాగా, దేశ వ్యాప్తంగా నీట్‌ యూజీ పరీక్షను 557 నగరాలు, 14 అంతర్జాతీయ నగరాల్లో మొత్తం 5,453 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలను ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. సుమారు 22.7 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad