పూణే: ఫిడే మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నీ 2024-25 టైటిల్‌ను తెలుగు తేజం, గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి గెలుచుకుంది. పుణె వేదికగా బుధవారం జరిగిన ఫైనల్ రౌండ్‌లో బల్గేరియాకు చెందిన నుర్గుయిల్ సలిమోవాపై తలపడిన హంపి మళ్లీ నీటి విజయం సాధించింది. దీంతో హంపిక ఒక పాయింట్ లభించింది. మరోవైపు చివరి రౌండ్ గేమ్ జు జినర్ (చైనా) కూడా విజయం సాధించడంతో హంపి అగ్రస్థానంలో కొనసాగింది. జు జినర్ ఫైనల్ రౌండ్‌లో రష్యాకు చెందిన పొలినా షువలోవాపై గెలుపొందింది. దీంతో 9రౌండ్‌లు ముగిసేసరికి వీరిద్దరూ 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. టై-బ్రేక్ ఆధారంగా హంపి టైటిల్ విజేతగా నిలిచింది. మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక.. ముంగంతూల్ బతుయాగ్ (మంగోలియా) తోబీ వైశాలి.. సలోమ్ మెలియా (జార్జియా)తోబీ దివ్య దేశ్‌ముఖ్.. ఎలీనా కష్లిన్‌స్కాయా (రష్యా)తో తమ తమ చివరి గేమ్‌లను డ్రాగా ముగించారు.
ఫిడే మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీ విజేత కోనేరు హంపి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES