Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeఆటలురూల్స్‌ మారాయి!

రూల్స్‌ మారాయి!

- Advertisement -

– కీలక నిబంధనలకు ఐసీసీ ఆమోదం
దుబారు:
అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) రెండు కీలక రూల్స్‌ను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. వన్డేల్లో రెండు వైపుల కొత్త బంతిని వాడుతుండగా.. ఇక నుంచి 34వ ఓవర్‌ తర్వాత రెండింటిలో ఒక బంతిని మాత్రమే వాడనున్నారు. వన్డే మ్యాచ్‌ ఏ కారణాలతో అయినా 25, అంతకంటే తక్కువ ఓవర్లకు కుదించబడితే ఇన్నింగ్స్‌ మొత్తానికి ఒక బంతినే వాడాల్సి ఉంటుంది. ఇక కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఆటగాళ్ల నిబంధనలను సమూలంగా మార్పు చేశారు. మ్యాచ్‌కు ముందే ఇరు జట్లు ఓ వికెట్‌ కీపర్‌, ఓ బ్యాటర్‌, ఓ సీమ్‌ బౌలర్‌, ఓ స్పిన్‌ బౌలర్‌, ఓ ఆల్‌రౌండర్‌ పేర్లను మ్యాచ్‌ రిఫరీకి అందించాలి. కంకషన్‌కు గురైన ఆటగాడి రోల్‌ను బట్టి సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడికి రిఫరీ ఆమోదం ఉంటుంది. సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు సైతం కంకషన్‌కు గురైతే.. బెంచ్‌పై ఉన్న ఇతర ఆటగాళ్ల నుంచి రిఫరీ నేరుగా ఒకరిని ఎంచుకుంటారు. సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్‌ కమిటీ రూపొందించిన ఈ రూల్స్‌కు ఐసీసీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. కొత్త రూల్స్‌ టెస్టుల్లో ఈ నెల 17 నుంచి, వన్డేల్లో జులై 2 నుంచి, టీ20ల్లో జులై 10 నుంచి అమల్లోకి రానున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad