Wednesday, April 30, 2025
Homeజాతీయంఉద్ద‌మ్‌పూర్‌లో జ‌వాన్ల‌కు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య కాల్పులు

ఉద్ద‌మ్‌పూర్‌లో జ‌వాన్ల‌కు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య కాల్పులు

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్: జ‌మ్మూక‌శ్మ‌ర్ లోని ఉద్ద‌మ్‌పూర్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. డూడు బసంత్‌గర్ వ‌ద్ద బల‌గాలు కూంబింగ్ నిర్వ‌స్తుండ‌గా..జ‌వాన్ల‌కు ఉగ్ర‌వాదులు తార‌స‌ప‌డ్డారు. త‌ప్పించుకోవ‌డానికి బల‌గాల‌పై వెంట‌నే ఉగ్రవాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన జ‌వాన్లు..ఎదురు కాల్పుల‌కు దిగారు. టెర్ర‌రిస్తులు స‌మీపంలోనే అడ‌వుల్లోకి ప‌రారైయ్యారు. అద‌న‌పు బ‌ల‌గాల‌తో అడువులోకి వెళ్లి అధికారులు గాలిస్తున్నారు. అదేవిధంగా పూంచ్ జిల్లా ప‌రిధిలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. జ‌మ్మూ-రాజ్‌పూరి నేష‌న‌ల్ వెంబ‌డి హైల‌ర్ట్ ప్ర‌క‌టించారు ఆయా మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి..ప్ర‌తి వాహ‌నాన్ని త‌నిఖీ చేస్తున్నామ‌ని ట్రాఫిక్ పోలీస్ అధికారి అమీద్ దిన్ చెప్పారు.మ‌రోవైపు ప‌హ‌ల్గాంలో ప‌ర్య‌ట‌కులపై దాడులు చేసి..28మందిని చంపిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ‌మ్మూక‌శ్మీర్ అంత‌టా భ‌ద్ర‌తాను పెంచారు. స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో అద‌న‌పు బ‌ల‌గాల‌తో ప‌క‌డ్బంధీగా భ‌ద్ర‌తా క‌ల్పించారు. నిరంతరం ఉగ్ర‌వాదుల క‌దిలిక‌ల‌ను తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు, సీసీ కెమెరాల‌తో నిఘా పెంచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img