Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeనల్లగొండఅక్రమ కేసులతో పోరాటాలను ఆపలేరు

అక్రమ కేసులతో పోరాటాలను ఆపలేరు

- Advertisement -


-అ ప్రభుత్వ అరాచకాలను ఎత్తి చూపినందుకే నోటీసులు
-అ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
నవతెలంగాణ-నకిరేకల్‌
:సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న అరాచకాలను, అక్రమాలను ఎత్తిచూపినందుకే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని, అక్రమ కేసులు, నోటీసులతో బీఆర్‌ఎస్‌ ఉద్యమాలను ఆపలేరని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రేవంత్‌రడ్డి ప్రభుత్వం చేస్తున్న అక్రమ కేసులు, నోటీసులకు భయపడేది లేదన్నారు.ఫార్ములా ఈ రేస్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం రేపటి విచారణపై ఆయన స్పందించారు. ప్రజాసమస్యలు పరి ష్కరించేంతవరకు ప్రజాఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. అక్రమకేసులతో అడుగ డుగున నోటీసులతో అడ్డంకులు సష్టించే చిల్లర వేషాలు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. కేసులు, జైళ్లు, విచారణలు బీఆర్‌ఎస్‌ని ఆపలేవన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో రేపు విచారణకు హాజరవుతున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సంఘీభావంగా యావత్‌ రాష్ట్ర ప్రజానీకం కేటీఆర్‌కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad