నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ దేశంపై దౌత్యపరమైన అంశాలపై భారత్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ అంశాలపై పాక్ ప్రతీకార చర్యలకు దిగింది.గురువారం పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. పహల్గాం దాడి తర్వాత పాక్ విషయంలో భారత్ అనుసరిస్తున్న తీరుపై సమీక్ష ఈ భేటీలో సమీక్ష జరిపారు. సింధు జలాల నీటి ప్రవాహాన్ని ఆపడమంటే యుద్ధ చర్యగా పరిగణించబడుతుందని ఆదేశ జాతీయ భద్రతా మండలి పేర్కొన్నట్లు సమాచారం. సిమ్లా ఒప్పందంతో సహా భారతదేశంతో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలుపుదల చేస్తున్నట్లు షెహ్‌బాజ్ షరీఫ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వాఘా సరిహద్దు పోస్టును మూసివేయాలని, పాక్ గగనతలం నుంచి వెళ్లే భారత విమానాలకు అనుమతిని రద్దు చేస్తున్నట్లు షరీఫ్ ప్రభుత్వం ప్రకటించింది.
సిమ్లా ఒప్పందానికి స్వస్తి: పాక్ పీఎం
- Advertisement -
RELATED ARTICLES