Wednesday, April 30, 2025
Homeమానవికదలకుండా కూర్చుంటున్నారా?

కదలకుండా కూర్చుంటున్నారా?

అదేపనిగా ఎక్కువ సేపు కూర్చునే వారిలో మరణ ప్రమాదం 16 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. తైవాన్‌లో ఇటీవల నిర్వహించిన పరిశోధనకు సంబంధించిన వివరాలను నెట్‌వర్క్‌ ఓపెన్‌ జర్నల్‌లో ప్రచురించారు. ఎక్కువ సేపు కూర్చునే వారిపై 13 ఏండ్ల పరిశోధన తర్వాత దీన్ని విడుదల చేశారు.
అదేపనిగా గంటలతరబడి కూర్చొని పనిచేసే వారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 4,81,688 మంది వ్యక్తులపై జరిపిన అధ్యయనం తర్వాత, ఇతర వ్యక్తులతో పోలిస్తే అలాంటి వారికి హదయ సంబంధ వ్యాధులతో మరణించే ప్రమాదం 34 శాతం ఎక్కువగా ఉందని తేలింది. ఇతర వ్యాధుల వల్ల మరణించే ప్రమాదం కూడా 16 శాతం ఎక్కువట.
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బ్లడ్‌ షుగర్‌, అధిక రక్తపోటు, ఊబకాయం, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయే ప్రమాదం పెరుగుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ సమస్యలను కలిగిస్తుంది.
మహిళలు మరింత జాగ్రత్త..
రోజంతా కూర్చొని జిమ్‌కి వెళ్లినా ఉపయోగం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఒక నివేదిక ప్రకా రం, ఊబకాయం, కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు వంటి ప్రమాదకరమైన వ్యాధులు మహిళల్లో వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇలాంటి వారు తమ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించి, ఎక్కువసేపు కూర్చోవద్దని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img