Thursday, August 21, 2025
E-PAPER
spot_img
HomeNewsఎయిరిండియాలో సాంకేతిక లోపం..కోల్‌కతాలో ల్యాండింగ్

ఎయిరిండియాలో సాంకేతిక లోపం..కోల్‌కతాలో ల్యాండింగ్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వరుస వైఫల్యాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదాన్ని మరువకముందే తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబయికి వెళుతున్న ఎయిరిండియా విమానం (ఎఐ180) విమానం సోమవారం అర్థరాత్రి 12 గంటల 45 నిముషాలకు కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది భద్రతా కారణాలతో ప్రయాణీకులను విమానం నుంచి దించేశారు. అనంతరం మరమ్మతులు చేపట్టారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad