Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్ దాడిలో ఖమేనీ స‌న్నిహితుడు హ‌తం

ఇజ్రాయిల్ దాడిలో ఖమేనీ స‌న్నిహితుడు హ‌తం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆపరేషన్‌ ‘రైజింగ్‌ లయన్‌’ పేరుతో ఇజ్రాయిల్, ప్రామిస్ ట్రూతో ఇరాన్‌ల మధ్య యుద్ధం ఐదో రోజూ కొనసాగుతోంది. ఈక్ర‌మంలో ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్ మ‌రో కీల‌న నేత‌ల‌ను కోల్పోయింది.టెహ్రాన్‌పై టెల్‌అవీవ్‌ చేసిన దాడుల్లో ఇరాన్‌ సీనియర్-మోస్ట్ మిలిటరీ అధికారి, ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహిత సైనిక సలహాదారు అయిన అలీ షాద్మానీ (Ali Shadmani) మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ దళాలు వెల్లడించాయి. ఆయన సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ ప్రదేశంలో తల దాచుకున్నట్లు తమకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ చేస్తున్న పలు క్షిపణి దాడులకు అలీ షాద్మానీ నేతృత్వం వహించారని తెలిపింది.

మరోవైపు ఇరాన్..ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులు చేస్తోంది. మంగళవారం దాదాపు 20 బాలిస్టిక్ క్షిపణులను టెల్‌అవీవ్‌పై ప్రయోగించడంతో భారీ నష్టం సంభవించినట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది. భవనాలు, వాహనాలపై క్షిపణులు పడడంతో మంటలు ఎగసిపడుతున్నట్లు తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad