Friday, August 22, 2025
E-PAPER
spot_img
HomeNewsఈడి విచారణకు రాబర్ట్‌ వాద్రా గైర్హాజరు

ఈడి విచారణకు రాబర్ట్‌ వాద్రా గైర్హాజరు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్‌వాద్రా.. రెండోసారి ఈడి సమన్లకు గైర్హాజరయ్యారు. బ్రిటన్‌కు చెందిన ఆయుధ సలహాదారు సంజరు భండారికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈడి విచారణకు ఆయన గైర్హాజరైనట్లు అధికారిక వర్గాలు మంగళవారం ప్రకటించాయి. అంతకు ముందు తన ఫ్లూ లక్షణాలు ఉన్నాయని, ప్రోటోకాల్‌ ప్రకారం కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నానంటూ జూన్‌ 10న సమన్లను దాటవేశారు. దీంతో జూన్‌ 17 (మంగళవారం) విచారణకు రావాలని ఈడి సమన్లు జారీ చేసింది. అయితే యుఎఇ, బ్రిటన్‌ ప్రయాణ షెడ్యూల్‌ గురించి ఈడికి రాబర్ట్‌వాద్రా ముందుగానే తెలియజేశారని, భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad