– తిరువనంతపురంలో పార్టీ నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన కేరళ సీఎం పినరయి విజయన్
తిరువనంతపురం: ప్రజా సమస్యలపై ఉధృత పోరాటాలకు సమాయత్తం కావాలని వక్తలు పిలుపు నిచ్చారు. తిరువనంతపురంలో పార్టీ నూతన రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్‌ను గురువారం సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. సీనియర్ నాయకులు టీఎస్ రామచంద్రన్ పిళ్ళై పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, పొలిట్ బ్యూరో సభ్యులు ఏ. విజయరాఘవన్, పొలిటబ్యూరో సభ్యులు, సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ మాస్టర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
- Advertisement -