Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్త్వరలో ఇంటెల్‌లో భారీగా కార్మికుల తొలగింపు

త్వరలో ఇంటెల్‌లో భారీగా కార్మికుల తొలగింపు

- Advertisement -

శాన్‌ఫ్రాన్సిస్కో : ప్రముఖ టెక్‌ దిగ్గజం ఇంటెల్‌ భారీగా ఉద్యోగులు, కార్మికులను ఇంటికి పంపించే పనిలో ఉంది. ఇప్పటికే వేలాది మందిని తొలగించిన ఈ సంస్థ వచ్చే జులైలో మరింత మందిపై వేటు వేయడానికి సిద్దం అవుతోంది. తదుపరి తొలగింపుల్లో ఫ్యాక్టరీలో పని చేసే 15-20 శాతం మంది ఉద్యోగులపై ప్రభావం ఉండొచ్చని రిపోర్టులు వస్తోన్నాయి. ఇంటెల్‌ నూతన సిఇఒగా లిప్‌ బు టాన్‌ మార్చిలో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన పొదుపు చర్యలకు ప్రణాళికలు రూపొందించారు. కంపెనీ విడుదల చేసిన అంతర్గత మెమో ప్రకారం ఇంటెల్‌లో కొత్త విడత తొలగింపులు జులై మధ్యలో ప్రారంభమై నెలాఖరు నాటికి ముగిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నిర్ణయం చాలా బాధాకరమైనదని.. కానీ పరిశ్రమ సవాళ్లను పరిష్కరించడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో అవసరమనం ఇంటెల్‌ చిప్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ చీఫ్‌ నాగ చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. ఇంతక్రితం ఇంటెల్‌ 2024లో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో ఒరెగాన్‌లో 3,000 మంది సిబ్బంది ఉన్నారు. మరోమారు ఒరెగాన్‌ ఉద్యోగులపై వేటు పిడుగు పడనుందని అంచనా.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad