
– రూ.585 కోట్లతో అభివృద్ధి…
– విస్తరించిన వ్యవసాయ సాగు…
– నాడు – నేడు పేరుతో విద్యుత్ విజయోత్సవం…
– ఏర్పాట్లను పరిశీలించిన సీ.జీ.యం కిషన్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్ కోతల మోత, ఎప్పుడు విద్యుత్ వస్తుందో తెలియన దుస్తితి,పొలాల్లోనే రైతులు అర్ధరాత్రి పడిగాపులు,అడుగడుగునా రైతులకు అష్టకష్టాలు,సబ్ స్టేషన్ లు ముట్టడించడాలు,ధర్నాలు, రాస్తారోకోలు,విద్యుత్ ఉంటేనే వార్త.
ప్రత్యేక తెలంగాణ లో కోతలు లేని విద్యుత్ సరఫరా,వ్యవసాయానికి రోజంతా ఉచిత విద్యుత్ సరఫరా దీంతో అష్టకష్టాలు, పడిగాపులు కు చెక్,పురుగు – పుట్రా నుండి రక్షణ, పగలు వ్యవసాయ పనులు, తగ్గిన శ్రమ పెరుగుతున్న దిగుబడులు,పరిశ్రమలు, గృహాలకు సరఫరా పంపిణీ, పెరిగిన విద్యుత్ వినియోగం ప్రజల కంటి నిండా నిద్ర.నేడు విద్యుత్ పోతే వార్త. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే కరెంటు లేక ప్రజలకు చీకటి రోజులేనని ఎద్దేవ చేసిన నాటి పాలకులు ఇప్పుడు టీఎస్ ట్రాన్స్ కో, టీ.ఎస్ ఎన్పీ.డీ.సీ.ఎల్ అందిస్తున్న సేవలతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు.ఎగతాళి చేసిన ఆ రాష్ట్ర ప్రజలు కరెంట్ కోతలతో అల్లాడుతున్నారు.
2011 జూన్ 2 న తెలంగాణ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చిమ్మ చీకట్లను చీల్చుకుని రాష్ట్రం వెలుగులు విరాజిల్లుతుంది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలతో కేవలం నెలలోనే గృహ,వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ అందింది. గడిచిన తొమ్మిదేళ్ళ లో విద్యుత్ సరఫరాలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం తెలంగాణ విద్యుత్ విజయోత్సవం నిర్వహిస్తున్నారు.నియోజక వర్గం స్థాయిలో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని స్థానిక గిరిజన భవన్ లో విజయోత్సవం జరపడానికి ఎన్.పి.డి.సి.ఎల్ అశ్వారావుపేట ఎ.డి.ఇ బసవ వెంకటేశ్వర్లు కన్వీనర్ గా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.5 మండలాల విద్యుత్ శాఖ అధికారులు,ప్రజాప్రతినిధులు,వినియోగ దారులు మొత్తం 15 వందలు మందికి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఏర్పాట్లను ఆదివారం ఎన్.పి.డి.సి.ఎల్ సీ.జీ.ఎం కిషన్ పరిశీలించారు.
ఎ.డి.ఇ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం విద్యుత్ ప్రగతి ఇలా ఉంది. అశ్వారావుపేట నియోజక వర్గంలో 5 మండలాల్లో రాష్ట్ర ఆవిర్భావం నుండి రూ.585 కోట్ల వ్యయంతో విద్యుత్ సరఫరా అభివృద్ది చేసారు.
ట్రాన్స్ కో పరిధిలో వ్యయం కోట్లలో….
నాడు నేడు వ్యయం
400 కె.వి ఎస్.ఎస్ లు – 2 332.84
220 కె.వి ఎస్.ఎస్ లు – 2 9.45
132 కె.వి ఎస్.ఎస్ లు 1 2 22.87
ఇ.హెచ్.టి పి.టి.ఎఫ్ లు 2 7 25.45
మొత్తం వ్యయం కోట్లలో… 390.62
ఎన్.పి.డి.సి.ఎల్ పరిధిలో వ్యయం కోట్లలో…
నాడు నేడు వ్యయం
33/11 కె.వి ఎస్.ఎస్ లు 13 20 7.0
33 కె.వి లైన్స్ 118.0 237.6 7.77
11 కె.వి లైన్స్ 1144.0 2008.41 34.58
ఎల్.టి లైన్స్ 1517.0 2680.65 23.27
పి.టి.ఎఫ్ లు 22 38 6.25
డి.టి.ఎఫ్ లు 3489 6789 65.54
మొత్తం వ్యయం కోట్లలో ……. 157.41
నియోజక వర్గం వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులు….
రకం నాడు నేడు
గృహ 44026 60106
వ్యాపారం 3130 5699
వ్యవసాయం 10676 18043
పారిశ్రామిక 172 288
హెచ్.టి 8 18
ఇతరులు 1270 1991
మొత్తం 59291 86145