Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeసినిమాముస్సోరీలో శరవేగంగా..

ముస్సోరీలో శరవేగంగా..

- Advertisement -

చిరంజీవి, నయనతార జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అర్చన సమర్పిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తున్న నయనతార ముస్సోరీలో చిత్రీకరణలో జాయిన్‌ అయ్యారు. కథా పరంగా, తన పాత్రపై ఎంతో ఆనందంగా ఉన్న నయనతార సినిమా ప్రమోషన్‌ల్లో చురుకుగా పాల్గొనాలని నిశ్చయించుకున్నారు. ఇటీవలే ఆమె ఒక ప్రత్యేక ప్రమోషనల్‌ వీడియో చేశారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. రాబోయే ప్రచార కార్యక్రమాల్లోనూ నయనతార అదరగొట్టబోతున్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది. కమర్షియల్‌ ఫార్మాట్లలో హిలేరియస్‌ ఎంటర్‌టైనర్స్‌ చిత్రాలను రూపొందించడంలో మాస్టర్‌ అయిన అనిల్‌ రావిపూడి ప్రమోషనల్‌ కంటెంట్‌ను రూపొందించడంలో స్పెషలిస్ట్‌.
ఇప్పటివరకు ప్రతి ప్రమోషనల్‌ వీడియో మంచి క్రేజ్‌ సొంతం చేసుకుంది. ఇటీివలే రిలీజ్‌ చేసిన వీడియోలో చిరంజీవి వింటేజ్‌ అవతార్‌లో కనిపించి అలరించారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – అనిల్‌ రావిపూడి, నిర్మాతలు – సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, సమర్పణ – అర్చన, సంగీతం – భీమ్స్‌ సిసిరోలియో, డీవోపీ – సమీర్‌ రెడ్డి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ – ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటర్‌ – తమ్మిరాజు, రచయితలు – ఎస్‌ కష్ణ, జి ఆది నారాయణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – ఎస్‌ కష్ణ, లైన్‌ ప్రొడ్యూసర్‌ – నవీన్‌ గారపాటి,అడిషినల్‌ డైలాగ్స్‌ – అజ్జు మహంకాళి, తిరుమల నాగ్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad