Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

- Advertisement -

– కిలోమీటర్ల మేరా లావా, బూడిద మేఘాలు
– నిలిచిన విమాన సర్వీసులు
జకార్తా:
ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో పలు విమాన సర్వీసులకు ఆటంకం కలిగింది. బాలికి వెళ్లే పలు విమానాలు వెనక్కి మళ్లాయి. ఎయిరిండియా విమానం ఏఐ 2145 కూడా బాలికి వెళ్లకుండా వెనక్కి తిరిగి ఢిల్లీకి వచ్చింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపినట్లు ఎయిరిండియా ప్రకటించింది. దక్షిణ మధ్య ఇండోనేషియాలోని మౌంట్‌ లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం ఈ నెల 17న బద్దలవడంతో వేడి బూడిద 11 కిలోమీటర్ల ఎత్తున గాల్లోకి ఎగిసింది. బిలం నుండి 8 కిలోమీటర్ల (సుమారు 5 మైళ్ళు) వరకు లావా విస్తరించింది. ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం అగ్నిపర్వతం 10 వేల మీటర్లు (సుమారు 32,800 అడుగులు) ఎత్తున మందపాటి బూడిద మేఘాలను విడుదల చేసిందని, పుట్టగొడుగు ఆకారంలో ఉన్న బూడిద మేఘంగా ఆవరించిందని ఇండోనేషియా జియాలజీ ఏజెన్సీ తెలిపింది. అగ్నిపర్వతం నుండి 90 కిలోమీటర్లు (సుమారు 56 మైళ్ళు) నుంచి 150 కిలోమీటర్లు (దాదాపు 93 మైళ్ళు) దూరంలో ఉన్న నగరాల వరకు ఈ దట్టమైన బూడిద మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఈ విస్ఫోటనంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. భారీ వర్షాలు పడుతున్న కారణంగా అగ్నిపర్వతం నుండి ప్రవహిస్తున్న లావా నదుల్లోకి చేరే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad