– బ్యారేజీ నిర్మాణానికి సాంకేతిక అనుమతులు
– మంత్రి ఉత్తమ్‌కు అభినందన : ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఖమ్మం జిల్లాలోని సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు 67 టీఎంసీలు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది. అలాగే సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణానికి సాంకేతిక అనుమతులు సైతం మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ద్వారా ఖమ్మం జిల్లాలోని వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని తెలిపారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమంపై కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఇప్పించి, వారిని ఒప్పించి అధికారిక అనుమతులు సాధించారంటూ అభినందించారు. మంత్రి ఉత్తమ్ ప్రయత్నం ద్వారా భవిష్యత్తులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున బీడు భూములు సాగు చేసుకునేందుకు అవకాశం ఏర్పడిందని డిప్యూటీ సీఎం తెలిపారు. దశాబ్దాల తరువాత రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం మూలంగా అధికారిక అనుమతులు సాధించడం అభినందనీయమన్నారు.
సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు 67 టీఎంసీలు కేటాయింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES