Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅహ్మదాబాద్ బాధిత కుటుంబాలకు అండ‌గా ఉంటాం: ఎయిరిండియా ఛైర్మన్

అహ్మదాబాద్ బాధిత కుటుంబాలకు అండ‌గా ఉంటాం: ఎయిరిండియా ఛైర్మన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జూన్ 12న అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన దురదృష్టకర సంఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు. లండన్‌కు బయల్దేరిన డ్రీమ్‌లైనర్‌ ఏఐ171 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఒక భవనంపై కూలిపోయిన విషయం తెలిసిందే.

“టాటా సంస్థ నడిపే విమానయాన సంస్థలో ఈ ప్రమాదం జరిగినందుకు తీవ్రంగా చింతిస్తున్నాను. ఈ సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. వారికి అవసరమైన సాయాన్ని అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉంది. ఈ ఘటనకు గానూ బాధిత కుటుంబాలకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ ఘటనపై ఎలాంటి నిర్ధారణకూ రాలేము. బ్లాక్ బాక్స్, ఇతర రికార్డర్ల ద్వారా ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయి. అప్పటి వరకు వేచి ఉండాలి” అని చంద్రశేఖరన్ అన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని నియమించిందని ఆయన వెల్లడించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad