నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు శనివారం హెచ్చరించాయి. డ్రోన్లు, ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని తెలిపాయి. సముద్ర తీర ప్రాంతాల్లో భద్రత పెంచాలని సూచించాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం ఉందని, తీర ప్రాంతాల్లో బందోబస్తు పెంచాలని సూచించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయొచ్చని రైల్వే శాఖను అప్రమత్తం చేసింది.
- Advertisement -