నవతెలంగాణ – అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్పౌజ్ పింఛన్ల కోసం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి పింఛన్లు అందించనుంది. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా ఈ కేటగిరీని తీసుకొచ్చింది. గతేడాది నవంబర్ నుంచే దీన్ని అమలు చేస్తోంది. లబ్ధిదారులకు రూ. 4వేల చొప్పున ఇస్తోంది.
- Advertisement -