– ముందు మేడిగడ్డకు రిపేర్ చేయండి
– దమ్ముంటే నివేదిక వచ్చాక చర్యలు తీసుకోండి : ఎంపీ ఈటల రాజేందర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టుకి క్యాబినెట్ ఆమోదం లేకుండా ఉంటదా? ఏ చిన్న నిర్ణయమైనా క్యాబినెట్‌లో పెట్టాలని కేసీఆర్ అనేవారు. ఈ మాట నిజం కాదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ముందు మేడిగడ్డకు రిపేర్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరంపై పూర్తిస్థా యి రిపోర్టు వచ్చాక దమ్ముంటే అప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని మోడీ 11 ఏండ్ల పాలనపైనా, ఏడాదిగా మల్కాజిగిరి ఎంపీగా తన పాత్రపైనా ఈ నెల 22న ఇంపీరియల్ గార్డెన్‌లో వికసిత్ సంకల్ప సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఆ సభకు ముఖ్య అతిథులు కేంద్ర మంత్రు లు జి.కిషన్‌రెడ్డి, బండి సంజరు, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్ పాల్గొంటారని చెప్పారు. మోడీ పాలనపై శుక్రవారం ఎగ్జిబిషన్ ప్రారంభిం చనున్నట్టు తెలిపారు. గురువారం సికింద్రాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్నది గూడు కట్టించే ప్రభుత్వం కాదనీ, అది గూడు కూలగొట్టే సర్కారు అని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదలను భయభ్రాంతులకు గురిచేయడా న్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ జలయజ్ఞం నుంచే ప్రాణిహిత చేవెళ్ల వచ్చిందనీ, ప్రాణహిత చేవెళ్లలో కొత్తగా వచ్చి చేరిన వి అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డనేనని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక అమలు చేస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణను బీజేపీ ఎంపీగా డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రాజెక్టులకు బీజేపీ వ్యతిరేకం కాదనీ, ప్రాజెక్టులను ఏటిఎంగా మార్చుకోని దోచుకోవడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.
కాళేశ్వరానికి క్యాబినెట్ ఆమోదం లేకుండా ఉంటుందా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES