నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడితో ఆగ్రహించిన భారత్..పాకిస్థాన్ దేశంపై దౌత్యపరమైన అంశాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే 1960లో ఇరుదేశాల మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే నిలిపివేస్తున్నట్లు భారత్ వెల్లడించింది. దీంతో భారత్ వ్యవహరించిన తీరుపై దాయాది దేశం ప్రతిచర్యకు దిగింది. ఇండియాతో చేసుకున్న అన్ని రకాల ద్వైపాక్షిక ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు షరిప్ ప్రభుత్వం పేర్కొంది. సింధు జలాలను నిలుపుదల చేయడమంటే యుద్ధ చర్యల్లో భాగమేనని పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. తాజా పరిణామాలతో ఇవాళ సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి జల్ శక్తి మంత్రి సీఆర్ పటేల్, పలు శాఖలకు చెందిన ముఖ్య అధికారులు హాజరకానున్నారు. సింధు జలాల ఒప్పందంపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఈ ఒప్పందంపై పాక్ ప్రభుత్వానికి పలుమార్లు నోటీసులు పంపించామని, అగ్రిమెంట్‌లో పలు అంశాలపై పునర్ చర్చించాలని, మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరముందని జల్ శక్తి సెక్రటరీ దేవశ్రీ ముఖర్జీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందంలోని పలు ప్రాథమిక అంశాలపై మార్పులు చేయాలని, ఒప్పందంపై మరోమారు పునర్ సమీక్ష చేపట్టాలని భారత్ ప్రభుత్వం డిమాండ్ చేసిందని జల్ శక్తి సెక్రటరీ తెలిపారు. కానీ పాక్ ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలకు ఊతమిస్తుందని ఆయన ఆరోపించారు.
సింధు జలాల ఒప్పందంపై కేంద్ర హోంమంత్రి కీలక సమావేశం
- Advertisement -
RELATED ARTICLES