నవతెలంగాణ-హైదరాబాద్: జమ‌్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు 26మంది ప్రాణాలు కోల్పోగా..పలువురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ తదనంతర పరిణామాలతో భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుదేశాలు గతంలోనే చేసుకున్న సిమ్లా, సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఆ తర్వాత అన్ని రకాల వీసా అనుమతులను ఇరుదేశాలు రద్దు చేసుకున్నాయి. పాక్ దేశస్తులు వెంటనే తమ దేశం విడిచి తక్షణమే వెళ్లాలని భారత్ ప్రభుత్వం ఆదేశించింది. తమ దేశ గగనతలం గుండా భారత్ విమానాలు రాకపోకలు చేయకుండా షరిప్ ప్రభుత్వం నిషేధం విధించింది. మరోవైపు ఇరుదేశాలు సరిహద్దు ప్రాంతంలో క్షిపణులు పరీక్షలు చేపట్టాయి. దీంతో రెండు దేశాల ప్రతిచర్యలతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు చేసింది.పహల్గాంలో పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి ఘటన ను భారత్ సహా ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఆందోళనకర పరిస్థితిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నిశితంగా పరిశీలిస్తున్నారని ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ పేర్కొన్నారు. ఉగ్రదాడిని యూఎన్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రస్తుతం ఇరుదేశాలు సంయమనం పాటించాలని సూచించారు.
ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు
- Advertisement -