నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడిలో గాయపడిన బాధితులను పరామర్శించడానికి కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ శ్రీనగర్ కు బయలుదేరారు. జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా ఆస్పత్రికి వెళ్లి బాధితులను కలిసి మాట్లాడానున్నారు. ఏప్రీల్ 22న బైసనర్ లోయలో ఉగ్రమూకలు ఆకారణంగా దాడి చేసి 26మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు.
- Advertisement -