No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్హెల్మెట్ ధరించి ప్రమాదాలు నివారిద్దాం 

హెల్మెట్ ధరించి ప్రమాదాలు నివారిద్దాం 

- Advertisement -

తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి 
హెల్మెట్ ధరించిన వాహనదారులకు సన్మానం 
నవతెలంగాణ – తాడ్వాయి 

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రమాదాలను అరికడదాం అంటూ స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలో 163 జాతీయ రహదారిపై హెల్మెట్ ధరించి ప్రయాణించే ద్విచక్ర వాహనదారులను ఆపి 20 మందికి వారికి శాలువాలు కప్పి, పూల బొకేలు అందించి ఘనంగా సన్మానించారు. హెల్మెట్ ధరించడం వలన ఉపయోగాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చాలామంది ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించని కారణంగానే రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని తెలిపారు. తలకు తీవ్ర గాయాలయిపాలై గోల్డెన్ అవర్స్ లో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. హెల్మెంట్ ధరించడంతో కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేదంటే రోడ్డు భద్రత నిబంధనల ప్రకారం అపరాధ రుసుము తో పాటు, లైసెన్సులు క్యాన్సల్ చేసి, వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ పూజారి రమేష్, సాంబయ్య, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad