Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జయశంకర్ కి ఘన నివాళులు

జయశంకర్ కి ఘన నివాళులు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి బీసీ విద్యార్థి సంఘం, టీజేఎస్ ,  గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మహోన్నత ఉద్యమ శిఖరం, తెలంగాణ సిద్దాంతాన్ని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ సిద్దాంత కర్త ఉద్యమ స్ఫూర్తి ప్రదాత,తెలంగాణ ఉద్యమం లో మొదటి పేజీపై లిఖించదగ్గ ఉద్యమ వీరుడు అని కొనియాడారు. ఉద్యోగాలు, నిధులు, నీళ్లు, నియామకం అనే నినాదంతో తన వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేసిన మహోన్నత పోరాట యోధుడి ఆశయాలను సాధించినప్పుడే ఆయన కి మనమిచ్చే ఘనమైన నివాళులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, టీజేఏస్ జిల్లా అధ్యక్షులు కుంబాల లక్ష్మణ్ యాదవ్, గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు వినోద్ నాయక్, నాయకులు సంతోష్, మహేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad