Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలువిద్యార్థినుల వీడియోలు తీసిన వార్డెన్‌!

విద్యార్థినుల వీడియోలు తీసిన వార్డెన్‌!

నవతెలంగాణ- ఘట్‌కేసర్‌
ఘట్‌కేసర్‌లోని ఓ కళాశాలలో దారుణ ఘటన వెలుగుజూసింది. ఒక మహిళ అయి ఉండి.. అందునా హాస్టల్‌ వార్డెన్‌గా విద్యార్థినులకు రక్షణగా.. కంటికి రెప్పలా కాపాడాల్సినది పోయి విద్యార్థినుల ప్రయివేటు వీడియోలు, ఫొటోలను తీసి బార్సు హాస్టల్‌ వార్డెన్‌కు పంపింది. ఈ విషయాన్ని పసిగట్టిన విద్యార్థినులు ఆమె ఫోన్‌ లాక్కుని వాటిని గుర్తించి శుక్రవారం ఆందోళనకు దిగారు. ఘట్‌కేసర్‌ పోలీసులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అవుషాపూర్‌ శివారులోని ఓ కళాశాలలో లేడీస్‌ హాస్టల్‌ వార్డెన్‌గా రూప విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఆమె విద్యార్థినుల ప్రయివేటు ఫొటోలు, వీడియోలు తీసి ఇతరులకు పంపిస్తున్నట్టు కొందరు విద్యార్థినులకు అనుమానమొచ్చింది. దాంతో శుక్రవారం విద్యార్థిను లు ఆమె ఫోన్‌ లాక్కుని చూడగా అందులో వీడియోలు, ఫొటోలు కనిపించా యి. వాటిని బార్సు హాస్టల్‌ చీఫ్‌ వార్డెన్‌ సత్యనారాయణకు పంపించినట్టు గుర్తించి ఆందోళనకు దిగారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించి కళాశాల గేటు వద్దకు వచ్చి వార్డెన్‌ రూప, చీఫ్‌ వార్డెన్‌ సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే వారిని సస్పెండ్‌ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వారిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న ఘట్‌కేసర్‌ పోలీసులు అక్కడకు వెళ్లి విద్యార్థులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. వార్డెన్‌, చీఫ్‌ వార్డెన్‌ను సస్పెండ్‌ చేసే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. విషయాన్ని కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా, ఆ ఇద్దరు ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. దాంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img