– నేడు ఆసీస్-ఏతో భారత్ డీ
పెర్త్ (ఆస్ట్రేలియా) : ఎఫ్‌ఐహెచ్ హాకీ లీగ్ స్వదేశీ అంచె పోటీల్లో మిశ్రమ ఫలితాలు సాధించిన హాకీ ఇండియా మహిళల జట్టు.. కంగారూ గడ్డపై కఠిన సవాల్‌కు సిద్ధమైంది. ఐదు మ్యాచుల సిరీస్‌లో పోటీపడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సలీమ టెటె సేన నేడు ఆస్ట్రేలియా-ఏతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. శని, ఆదివారాల్లో ఆసీస్-ఏతో తలపడనున్న భారత్.. ఆ తర్వాత కంగారూ సీనియర్ జట్టుతో ఢకొీట్టనుంది. పెర్త్ హాకీ స్టేడియం భారత్, ఆసీస్ సవాల్‌కు వేదిక కానుంది.
ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో మిశ్రమ ఫలితాలు వచ్చినా.. వరల్డ్ నం.1 నెదర్లాండ్స్‌పై షూటౌట్‌లో విజయం సాధించటం భారత మహిళల జట్టులో ఆత్మ విశ్వాసం రెట్టింపు చేసింది. 26 మందితో ఆసీస్ వెళ్లిన సలీమ సేన.. సిరీస్ విజయమే లక్ష్యంగా ఆడనుంది. కెప్టెన్ సలీమ టెటె, వైస్ కెప్టెన్ నవనీత్ కౌర్‌లు జట్టును ముందుండి నడిపించనున్నారు. యంగ్ డ్రాగ్‌ఫ్లికర్ దీపిక, ఉదిత సింగ్‌లపై ప్రధానంగా ఫోకస్ ఉండనుంది. భారత గోల్స్ వేటలో దీపిక, ఉదితలు కీలక పాత్ర పోషించనున్నారు. సీనియర్ గోల్ కీపర్ సవిత కెరీర్ 300వ మ్యాచ్ ఆడనుంది. ప్రత్యర్థిని నిలువరించటంలో సవిత అనుభవం భారత్‌కు ఉపయుక్తం కానుంది. తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చిన జ్యోతి సింగ్, సుజాత కుజుర్, అజ్మినా కుజుర్, పూజ యాదవ్, మహిమ టెటెలు ఈ సిరీస్‌లో అరంగ్రేటం చేసే అవకాశాలు ఉన్నాయి.
అమ్మాయిలు రాణిస్తారా?
- Advertisement -