Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుపట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన రైలు..మహిళ మృతి

పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన రైలు..మహిళ మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతిచెందింది. సుమారు 55-60 ఏండ్ల వయస్సు గల మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. కొత్తపల్లిలో మూసి వేసి ఉన్న కొత్తపల్లి రైల్వే గేట్ వద్ద పట్టాలు దాటుతుండగా దూరంతో ఎక్స్ ప్రెస్ రైలు ఆమెను ఢీకొట్టిందని చెప్పారు. దీంతో శరీరం ముక్కలైందని, కాళ్ల భాగం రైలు పట్టాలపై పడి ఉండగా, తల భాగం ట్రైన్ ఇంజన్ ముందు భాగంలో ఇరుక్కోగా కాజిపేట రైల్వేస్టేషన్‌లో గమనించి తల భాగాన్ని బయటకు తీశారన్నారు.

మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు గాని, వస్తువులు గాని లేవని తెలిపారు. రైలు పట్టాలపై పడిఉన్న శరీర భాగలను తీసుకుని వెళ్లి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం దవాఖానలోని మార్చరీలో భద్రపర్చామని వెల్లడించారు. ఈఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు ఫోన్ నంబర్ 9949304574, 8712658604కి సమాచారం అందించాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad