Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్2 రోజుల్లో వారందరి అకౌంట్లలో డబ్బులు జమ : మంత్రి తుమ్మల

2 రోజుల్లో వారందరి అకౌంట్లలో డబ్బులు జమ : మంత్రి తుమ్మల

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల్లో హైదరాబాద్ మహానగర ఓ ఆర్ ఆర్ లోపల ఉన్న రైతుల ఖాతాలలో… రైతుబంధు డబ్బులు వేస్తామని ప్రకటన చేశారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల 2.13 లక్షల ఎకరాల భూములు ఉన్నాయని తాజాగా వెల్లడించారు. ఇక అందులో 93 వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగుకు అనుకూలం కానీ భూములు ఉన్నాయని రైతు భరోసా డబ్బులు నిలిపివేశామని గుర్తు చేశారు.
మిగతా 1.20 లక్షల ఎకరాల భూమికి రైతు భరోసా వర్తింప చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రెండు లేదా మూడు రోజుల్లోనే వారందరికీ రైతు భరోసా నిధులు పడతాయని ప్రకటన చేశారు. ఏ రైతులయితే భూమి సాగు చేస్తారో వాళ్లకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ సాగు జరుగుతున్న అన్ని భూములకు రైతు భరోసా నిధులు ఇస్తామన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad