Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
HomeNews'జన నాయకుడు'గా విజయ్‌

‘జన నాయకుడు’గా విజయ్‌

- Advertisement -

హీరో విజయ్‌ చివరిగా నటిస్తున్న సినిమా ‘జన నాయకుడు’. ఆయన బర్త్‌ డే సందర్భంగా మేకర్స్‌ ‘ఫస్ట్‌ రోర్‌’ గ్లింప్స్‌ను ఆదివారం విడుదల చేశారు. ఆయన చివరి చిత్రం కావటంతో ఈ లెజెండ్రీకి వీడ్కోలు పలకటానికి బీజం చేసినట్లు గ్లింప్స్‌ చూస్తుంటే అర్థమవుతుంది. 65 సెకన్ల వ్యవధి ఉన్న ఫస్ట్‌ రోర్‌ వీడియోను గమనిస్తే, ‘నా హదయంలో ఉండే..’ అనే మాటలు విజయ్‌ వాయిస్‌లో మనకు వినిపిస్తాయి. పోలీస్‌ డ్రెస్‌లో లాఠీ పట్టుకుని యుద్ధ వాతావరణాన్ని తలపించే ప్రదేశంలో నడుస్తూ వస్తుంటారు. ఈ విజువల్స్‌ చూస్తుంటే మైండ్‌ బ్లోయింగ్‌గా ఉన్నాయి. శక్తి, శాంతి, గంభీరతను కలగలిపేలా ఉన్న ఈ సన్నివేశం చూస్తుంటే ఈ మూవీ విజరుకి సాధారణ వీడ్కోలు కాబోదనే సంకేతాన్ని స్పష్టంగా ఇస్తోంది. ఈ వీడియోతో పాటు విడుదలైన బర్త్‌ డే పోస్టర్‌ మరింతగా మెప్పిస్తోంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, స్టార్‌డమ్‌కి అర్థాన్ని మార్చేసిన హీరో కెరీర్‌కి ఇస్తున్న ముగింపుగా భావిస్తున్నారు. ఇది ఓ వ్యక్తి ఉద్యమంగా ఎలా మారాడో తెలియజేసే గొప్ప నివాళి అని చిత్ర బృందం తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad