Wednesday, April 30, 2025
Homeజాతీయంగాజువాకలో వృద్ద దంపతుల దారుణ హత్య

గాజువాకలో వృద్ద దంపతుల దారుణ హత్య

నవతెలంగాణ – అమరావతి: విశాఖపట్నంలోని గాజువాక సమీపంలో ఉన్న రాజీవ్‌నగర్‌లో ఇంట్లోనే ఓ వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. అయితే, శుక్రవారం రాత్రి వరకు వారి ఇంటి తలుపులు మూసే ఉండటం, ఇంటికి రెండు వైపులా తాళాలు వేసి ఉండడంతో అనుమానం వచ్చిన స్థానిక బంధువుల అమ్మాయి పోలీసులకు సమాచారం అందించింది. సౌత్‌ ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. హాల్లో యోగేంద్రబాబు, బెడ్‌రూమ్‌లో లక్ష్మి రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. వారు అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులకు ఇద్దరు పిల్లలు కాగా, వారు వివాహాలు చేసుకుని అమెరికాలో స్థిరపడినట్లు తెలిసింది. అయితే దాదాపు 40 ఏళ్ల క్రితం ఈ దంపతులు కులాంతర వివాహం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసుల తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img