నవతెలంగాణ-హైదరాబాద్: పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతాబలగాలు ముష్కరుల వేట సాగిస్తున్నాయి. ఇందులో భాగంగానే లష్కరే తోయిబా ఉగ్రసంస్థతో సంబంధం ఉన్న వారి కోసం తీవ్రంగా గాలస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఇళ్లను వెతికి వాటిని ధ్వంసం చేసే పనిలో పడ్డాయి. షోపియన్, కుల్గామ్, పుల్వామా జిల్లాల్లో భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. షోపియాన్‌లోని చోటిపొరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశాయి. గత మూడు, నాలుగు ఏళ్లుగా ఉగ్ర సంబంధిత కార్యకలాపాల్లో షాహిద్ చురుగ్గా పాల్గొంటున్నాడని అధికారులు వెల్లడించారు. కుల్గాంలోని మతాలం ప్రాంతంలో మరో యాక్టివ్ టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ నివాసాన్ని ధ్వంసం చేశారు. ఇదే జిల్లాలో లష్కరేకు చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశారు. మరో ఉగ్రవాది హరిస్ అహ్మద్ నివాసం కూడా పుల్వామాలోని కాచిపోరా ప్రాంతంలో జరిగిన పేలుడులో ధ్వంసమైంది. కుల్గాంలోని ముర్రాన్ ప్రాంతంలో ఉగ్రవాది అహ్‌సన్ ఉల్ హక్ ఇంటిని బాంబులతో కూల్చారు. పెహల్గాం దాడికి పాల్పడిన ముష్కరుల్లో ఒకడైన ఆదిల్ హుస్సేన్ థోకర్, మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లు ఇప్పటికే నేలమట్టమయ్యాయి. కాగా..ఉగ్రవాదులను పట్టుకోవడానికి సైన్యం భారీ వేట ప్రారంభించింది. సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జమ్ముకశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
జమ్మూలో ఉగ్రవాదుల ఇండ్ల కూల్చివేత
- Advertisement -
- Advertisement -