Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅరగుండు గీయించి.. మురికినీరు తాగించి..

అరగుండు గీయించి.. మురికినీరు తాగించి..

- Advertisement -

– గోవులు, దూడల అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణ
– ఒడిశాలో దళితులపై ఘటన..పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
గంజాం:
ఒడిశాలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గోవులను, దూడలను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలతో దళిత వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై కొందరు వ్యక్తులు దాడి చేసి, వారికి అరగుండు చేయించి, బలవంతంగా మురుగునీరు తాగించారు. ఈ అమానుష సంఘటన గంజాం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాం జిల్లా ధారాకోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం హరిపూర్‌ గ్రామంలో ఒక వ్యక్తి వద్ద నుంచి ఒక ఆవు, రెండు దూడలను కొనుగోలు చేసి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో ఖారిగుమ్మ అనే ప్రాంతానికి చేరుకోగానే, సుమారు ఏడెనిమిది మంది వ్యక్తులు వారిని అడ్డగించారు. పశువులను అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
అలాగే బాధితుల వద్ద నుంచి బలవంతంగా డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిం చారు. బాధితులు దీనిని ప్రతిఘటించడంతో నిందితులు వారిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ఆ దుండగులు బాధితులిద ్దరికీ అరగుండు గీయించారు. బలవంతంగా వారిద్దరిచేత మురుగు కాలువలోని నీటిని తాగించారు. వీధుల్లో మోకాళ్లపై నడిపించి తీవ్రంగా అవమానించారు. వారి వద్ద నుంచి తప్పించుకున్న బాధితులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ధారాకోట పోలీస్‌ స్టేషన్‌ అధికారి చంద్రికా స్వయిన్‌ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad