నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడిపై దేశీయంగా, అంతర్జాతీయంగా రోజురోజుకు నిరసనలు మిన్నంటుతున్నాయి. పలు దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు పాక్ ఎంబీసీ ఎదుట భారీగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా తమ గళం విన్పిస్తున్నారు. శనివారం ఆస్ట్రేలియాలోని మెల్‌బర్న్ లో ప్రవాస భారతీయులు భారీ నిరసన తెలిపారు. ప్లకార్డులు చేబూని ర్యాలీ తీశారు. పాక్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలు ఆపాలని, పహల్గాం బాధితులకు సరైన న్యాయం చేయాలని, ఆదేశ సైన్యం.. ఉగ్రవాద ఆర్మీ అని ప్రవాస భారతీయులు నినదించారు. అదే విధంగా ఆస్ట్రేలియాలోని పాక్ రాయబార కార్యాలయం కూడా ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. మరోవైపు నేపాల్ లోని పాక్ రాయబార ఆఫీస్ వద్ద కూడా ఆదేశంలోని భారతీయులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి లండన్‌లోని పాక్ ఎంబీసీ ఎదుట కూడా ఇండియన్స్ భారీ నిరసన ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా పలు దేశాల అధినేతలు భారత్‌కు బాసటగా నిలుస్తున్నారు. ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఏప్రీల్ 22న పహల్గాం బైసనర్ లోయలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈదాడిలో 26మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆస్ట్రేలియాలో ప్రవాసభారతీయుల నిరసన
- Advertisement -
RELATED ARTICLES