– వైద్యాధికారి కె.వి.సంఘమిత్ర
– బోడాయికుంట, ఈదుళ్లలో వైద్య శిబిరం
నవతెలంగాణ – ఆళ్ళపల్లి : వర్షాకాలం సీజన్ దృష్ట్యా దోమల నివారణకు ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి కె.వి.సంఘమిత్ర ప్రజలకు సూచించారు. ఈ మేరకు పి.హెచ్.సి వైద్యాధికారి సంఘమిత్ర ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మర్కోడు సబ్ సెంటర్ పరిధిలోని బోడాయికుంట, ఈదుళ్ల గ్రామాల్లో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అందులో భాగంగా రెండు గ్రామాల్లో వైద్య సిబ్బంది, ఆశాలు, కలిసి ఇంటింటి సర్వే చేపట్టారు.
ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. జ్వరంతో బాధపడుతున్న వారికి డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాల నిర్ధారణకు రక్త పరీక్షలు చేశామన్నారు. 19 మంది జ్వర పీడితులకు డెంగ్యూ రక్త పరీక్షలు, 19 మందికి మలేరియా రక్త పరీక్షలు చేశామని, అందరికీ రిపోర్ట్స్ నెగెటివ్ గానే వచ్చాయన్నారు. ఈ వైద్య శిబిరంలో మొత్తం 85 మంది రోగులను పరీక్షించడం జరిగిందని చెప్పారు. అనంతరం హెల్త్ ఎడ్యుకేటర్ టి.రమాదేవి మాట్లాడుతూ.. వర్షాకాలంలో జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీంతో పాటు ప్రతీ శుక్రవారం డ్రై డే – ఫ్రై డే కార్యక్రమాన్ని పాటించాలని తెలిపారు. అదేవిధంగా నీళ్లు వేడి చేసి, చల్లార్చిన నీరే తాగాలని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో హెల్త్ అసిస్టెంట్ లు శ్రీధర్ బాబు, ఎం.నరేష్, ఆశా వర్కర్లు కృష్ణకుమారి, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.
ఇంటి చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES