Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యాశాఖ మంత్రిని నియమించి ,విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

విద్యాశాఖ మంత్రిని నియమించి ,విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

యూఎస్ఎఫ్ఐ డిమాండ్ 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని యూఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుకోవడానికి జిల్లా కమిటీ సమావేశం ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించారు.ఈ సమావేశానికి యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తాటికొండ రవి, మాదం తిరుపతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు తాటికొండ రవి మాదం తిరుపతి మాట్లాడుతూ..విద్యా సంవత్సరం ప్రారంభమై 13 రోజులు అయిన ప్రభుత్వ విద్యా సంస్థల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు.అదేవిధంగా బెస్ట్ డెవలప్మెంట్ స్కూల్ స్కీము సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మూడు సంవత్సరాల నుండి నిధులు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.అలాగే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 17 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని అన్నారు. అలాగే గత నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటికీ విడుదల చేయకపోవటం చూస్తూంటే రాష్ట్ర ప్రభుత్వ భాధ్యరాహిత్యం కనపడుతుంది అన్నారు.అదే విధంగా సమాజాన్ని మార్చే శక్తిగల విద్యారంగానికి మంత్రిని కేటాయించకపోవటం సిగ్గు చేటు అన్నారు.అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న, మండలాల వారిగా ఇంచార్జ్ మండల విద్యాశాఖ అధికారులను నియమించిన ఫలితం మాత్రం శూన్యం అన్నారు. అలాగే ప్రైవేటు,కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజు లు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా ఉండటం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి అని అన్నారు.అదే విధంగా ఎంసెట్ కౌన్సెలింగ్ ఇప్పటికీ నిర్వహించక విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వనిదే అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని లేని యెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు నాగరాజు, పెద్ది సూరి మరియు జిల్లా ఉపాధ్యక్షులు మహేష్,గణేష్ జిల్లా సహాయ కార్యదర్శిలు ప్రశాంత్,రాజు మరియు జిల్లా కమిటీ నాయకులు విశాల్,శివ,అభిషేక్,బాబురావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -