Tuesday, April 29, 2025
Homeజాతీయంస్టార్టప్‌లకు గడ్డుకాలం

స్టార్టప్‌లకు గడ్డుకాలం

– రెండేండ్లలో 28వేలకు పైగా కంపెనీలు క్లోజ్‌
– కొత్తగా ఏర్పాటయ్యేవీ చాలా తక్కువే..!
– ఈ ఏడాదిలో స్థాపించిన అంకుర సంస్థలు 125 మాత్రమే
– ‘ట్రాక్సన్‌’ నివేదిక సమాచారం
న్యూఢిల్లీ:
దేశంలోని మోడీ పాలనలో అంకుర సంస్థలు(స్టార్టప్‌లు) అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవాలనీ, ఉద్యోగ కల్పనలో తమ వంతు పాత్ర పోషించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చూస్తున్న యువపారిశ్రామికవేత్తలకు అలాంటి పరిస్థితులు కనబడటం లేదు. ఇది వారిని తీవ్ర నిరాశకు, కలవరానికి గురి చేస్తున్నది. దేశంలో వేల సంఖ్యలో స్టార్టప్‌లు మూతపడుతుండటమే ఈ పరిస్థితికి నిదర్శనం. భారత్‌లో గత రెండేండ్లలో 28 వేలకు పైగా స్టార్టప్‌లు క్లోజ్‌ అయ్యాయి. డేటా ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రాక్సన్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
రెండేండ్లలో 12 రెట్లు అధికం
ఈ నివేదిక సమాచారం ప్రకారం.. గత రెండేండ్లలో 28,638 స్టార్టప్‌లు క్లోజ్‌ అయ్యాయి. ఇందులో, 2023లో 15,921, 2024లో 12,717 కంపెనీలు ఉన్నాయి. స్టార్టప్‌లు మూతపడుతున్న తీరు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నది. గత రెండేండ్లలో మూతపడిన స్టార్టప్‌ల సంఖ్య అనేది.. 2019 నుంచి 2022 మధ్య క్లోజ్‌ అయిన కంపెనీల సంఖ్య కంటే 12 రెట్లు అధికంగా కావటం గమనార్హం. ఈ మూడేండ్లలో క్లోజ్‌ అయిన అంకుర సంస్థల సంఖ్య 2300.
తగ్గిపోతున్న స్టార్టప్‌లు
దేశంలో కొత్తగా ఏర్పాటు చేసే స్టార్టప్‌ల సంఖ్య కూడా తగ్గిపోవటం ఆందోళనను కలిగిస్తున్నది. 2019 నుంచి 2022 మధ్య నెలకొల్పబడిన అంకుర సంస్థల సంఖ్య 9600కు పైగా ఉండగా.. అది 2024లో 5264కు పడిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు స్థాపించబడిన స్టార్టప్‌లు 125 మాత్రమే కావటం గమనార్హం. ఈ మూసివేతలు అధికంగా అగ్రిటెక్‌, ఫిన్‌టెక్‌, ఎడ్‌టెక్‌, హెల్త్‌టెక్‌ రంగాలలో జరిగాయని తెలుస్తున్నది. స్టార్టప్‌ల కొనుగోలు సంఖ్య కూడా తగ్గిపోయింది. 2021లో ఇది 248గా ఉండగా.. గతేడాది 131కి పడిపోయింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే 259 స్టార్టప్‌లు క్లోజ్‌ అయ్యాయి. రాబోయే నెలల్లో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ చేయూత లేకే ఈ పరిస్థితి
అంకుర సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం. యువతను ఉద్యోగార్థుల్లా కాకుండా.. ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. వారి ఆర్థిక స్వావలంబనకు అవకాశాన్ని కల్పిస్తాయి. కాబట్టి.. వివిధ రంగాల్లో కొత్తగా కంపెనీలు ఏర్పాటు చేసేవారికి, యువతకు ప్రభుత్వం నుంచి మద్దతు చాలా తప్పనిసరి. స్టార్టప ్‌లకు ఎదురేయ్యే కష్టాలను గుర్తించి, వాటిని తొలగిం చేలా చర్యలు తీసుకోవాలి. అయితే, కొన్నేండ్ల క్రితం స్టార్టప్‌లపై ప్రభుత్వాలు పెట్టిన శ్రద్ధ.. ప్రస్తుతం కనబడటం లేదు. ఈ కారణంగానే అంకుర సంస్థలు మూతపడుతు, కొత్తవి ఏర్పాటు కాక.. క్లిష్ట పరిస్థితు లను ఎదుర్కొంటున్నాయని నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img