– ఆయన భార్య అక్రమార్జన పైనా కొనసాగుతున్న ఆరా
– వెలుగు చూస్తున్న రూ.కోట్లు విలువైన అక్రమాస్తులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
కాళేశ్వరం ఇంజినీరింగ్ చీఫ్ భూక్య హరిరాం ఆదాయానికి మించి రూ. కోట్లలో అక్రమాస్తులను సంపాదించారనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఆయన ఆస్తులపై మెరుపుదాడులను నిర్వహించారు. హరిరాంతో పాటు ఆయన భార్య డిప్యూటీ ఇంజినీరింగ్ చీఫ్, వాలాంతరీ సంస్థ డైరెక్టర్ సునీత ఆస్తులపై కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏసీబీకి డైరెక్టర్ జనరల్ విజరు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాళేశ్వరంతో పాటు ఇరిగేషన్ విభాగం గజ్వేల్ శాఖలో చీఫ్ ఇంజినీర్ అయిన హరిరాం ఆ ప్రాజెక్ట్ డిజైన్ మార్పిడితో పాటు దాని నిర్మాణానికి అవసరమైన కోట్లాది రూపాయల రుణ సేకరణలో కీలక పాత్ర వహించినట్టు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఆ సందర్భంలోనే అక్రమాలకు పాల్పడి హరిరాం కోట్లాది రూపాయల అక్రమా స్తులను సంపాదించిన ట్టు ఏసీబీ దృష్టికి వచ్చింది. దీంతో ఉదయం 5 గంటల నుంచే పదికి పైగా ఏసీబీ ప్రత్యేక బృందాలు హరిరాంనకు చెందిన ఆస్తులపై దాడులను ప్రారంబిచాయి. షేక్‌పేట్‌లో ని విల్లాతో పాటు హైదరా బాద్, సిద్ధిపేట్, కొత్తగూడెం జిల్లాల్లోని ఆయన బంధువుల నివాసాల్లోనూ ఏసీబీ అధికా రులు సోదాలను జరుపుతున్నారు. ఈ సోదాల్లో షేక్‌పేట్‌లో ఒక విల్లా, కొండాపూర్‌లో మరో విల్లా, శ్రీనగర్‌లో ఒక ఫ్లాట్, మాదాపూర్‌లో మరో ఫ్లాట్, నార్సింగిలో ఇంకో ఫ్లాట్ ఉన్నట్టు అధికారులు కనుగొ న్నారు. అలాగే, అమరావతిలో విలువైన వాణిజ్య భూమి, సిద్ధిపేట్ జిల్లా మర్కూక్ మండలంలో 28 ఎకరాల భూమి, పటాంచెరులో 20 గుంటల భూమి కూడా ఉన్నట్టు తేల్చారు. అలాగే, హైదరాబాద్ శ్రీగర్‌కాలనీలో రెండు నివాసాలు, బొమ్మల రామారంలో మామిడితోటతో కూడిన ఆరెకరాల భూమి, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం, కుత్భుల్లాపూర్‌లో ఒక ప్లాటు, మిర్యాలగూడ లో మరో ప్లాటు ఉన్నట్టు కనిపెట్టారు. అలాగే, సొంతంగా ఒక బీఎండబ్ల్యూ కారుతో పాటు మరో కారు, ఇంట్లో బంగారు ఆభరణాలు, పెద్ద మొత్తంలో బ్యాంకు డిపాజిట్లు కూడా కలిగి ఉన్నట్టు అధికారులు సోదాలో తేల్చారు. కాగా, నిందితుడు హరిరాంను అరెస్ట్‌చేసిన అధికారులు.. ఇంకా సోదాలను నిర్వహిస్తున్నారని ఏసీబీ డీజీ తెలిపారు. ప్రస్తుతానికి తేలిన ఆస్తుల విలువ కోట్ల రూపాయల్లోనే ఉంటుంద ని ఆయన చెప్పారు. ఈ సోదాలు రాత్రి పొద్దుపో యేంత వరకు కూడా కొనసాగుతాయని తెలిపారు. మొత్తం 14 ప్రాంతాల్లో హరిరాం, ఆయన భార్య పేరిట ఉన్న ఆస్తులతో పాటు వారి బినామీల పేరిట ఉన్న ఆస్తుల పైనా సోదాలను జరుపుతున్నారు.
కాళేశ్వరం ఈఎన్సీ ఆస్తులపై ఏసీబీ దాడులు
- Advertisement -