నవతెలంగాణ – హైదరాబాద్: డా. ఎం. రాజీవ్ MBBS, MD (పల్మనాలజీ – ఉస్మానియా) తెలంగాణ లాసెట్ 2025లో ఉత్తమ ర్యాంక్ సాధించారు. వైద్య వృత్తిలో నిష్ణాతుడైన ఆయన, న్యాయ విద్యను అభ్యసించాలనే నిర్ణయం వెనుక ఉన్న అభిప్రాయం, సమాజానికి, ప్రజారోగ్య రంగానికి న్యాయపరమైన అవగాహనతో వైద్య రంగంలో సేవ చేయడం. వారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (Telangana State Medical Council)లో సభ్యుడిగా కూడా సేవలు అందిస్తున్నారు. “ఆరోగ్యానికి న్యాయం – న్యాయంగా ఆరోగ్యం” అన్న సంకల్పంతో వైట్ కోట్ (వైద్యం) మరియు బ్లాక్ కోట్ (న్యాయం) రెండింటి మేళవింపుతో ప్రజల హక్కుల కోసం, వైద్యుల రక్షణ కోసం, మరియు మెరుగైన ఆరోగ్య విధానాల కోసం ఆయన కృషి చేయబోతున్నారు. ఇది విద్య, సేవ, సమాజం కోసం ఒక గొప్ప ఉదాహరణ!
వైట్ కోట్‌కు బ్లాక్ కోట్ జోడించి సేవా మార్గంలో అరుదైన ప్రయాణం
- Advertisement -
- Advertisement -