- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కడప జిల్లాలో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం పేలి ఓ మహిళ మృతి చెందింది. యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూటీ ఛార్జింగ్ అవుతుండగా ఈ పేలుడు జరిగింది. దీంతో పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ(62) మంటల ధాటికి అక్కడికక్కడే మృతి చెందింది.
- Advertisement -