నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ముకాశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడి ఘటనను ఖండిస్తున్నట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) డైరెక్టర్ కాష్ పటేల్ ఆదివారం ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత ప్రభుత్వానికి నిరంతరం మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ దాడి దుష్టశక్తులైన ఉగ్రదాదుల నుండి ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పుకి చిహ్నమని అన్నారు. ఉగ్రదాడి బాధితులందరికి ఎఫ్‌బిఐ సంతాపాన్ని తెలుపోందని ఎక్స్‌లో పేర్కొన్నారు. భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు.
- Advertisement -