Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఇరాన్‌ నౌకాశ్రయంలో పేలుళ్లు.. 28కి పెరిగిన మృతుల సంఖ్య

ఇరాన్‌ నౌకాశ్రయంలో పేలుళ్లు.. 28కి పెరిగిన మృతుల సంఖ్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇరాన్‌లోని అత్యాధునిక షాహిద్‌ రజాయీ నౌకాశ్రయంలో శనివారం సంభవించిన భారీ పేలుళ్ల లో మృతిచెందిన వారి సంఖ్య 28కి పెరిగింది. ఈ ఘటనలో సుమారు 750 మందికిపైగా గాయపడ్డారు. పేలుడులో పెద్దఎత్తున చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దాదాపు 10 గంటలకుపైగా శ్రమించి మంటలను ఆర్పాల్సి వచ్చింది.పోర్టులో నిల్వ ఉన్న కొన్ని కంటెయినర్లు పేలడంతో ప్రమాదం జరిగిందని స్థానిక విపత్తు నిర్వహణ అధికారి మెహర్దాద్‌ హసన్జాదే చెప్పారు. ఈ ఘటనకు అసలు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. పేలుళ్లకు కారణం తెలుసుకోవడం కోసం దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. అయితే క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad