– కీలకమైన దస్త్రాలు దగ్దం
– అగ్నిప్రమాదంపై అనుమానాలేన్నో!
దాదర్: మహారాష్ట్ర రాజధాని ముంబయి లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబయిలో ఈడీ కార్యాలయం ఉన్న కైసర్-ఐ-హింద్ భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2.31 గంటల సమయంలో బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో ప్రమాదం చోటుచేసుకుంది. ఆరు గంటలకు పైగా అగ్నిమాపకసిబ్బంది శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. సెలవు దినం కావటంతో పాటు ఈడీ కార్యాలయంలో చెలరేగిన మంటల్లో కీలకమైన దస్త్రాలు కాలిపోయాయి. దీని వెనుక అవినీతి కేసుల్లో చిక్కుకున్న పలువురి నేతలకు సంబంధించిన ఫైళ్లు ఉన్నట్టు సమాచారం. దీనిపై సమగ్ర విచారణ జరిపితే కానీ వాస్తవాలు బయటకు రావని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ముంబయి ఈడీ ఆఫీసులో భారీ అగ్గి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES