Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంకూరగాయల పందిళ్ళ కోసం దరఖాస్తుల ఆహ్వానం

కూరగాయల పందిళ్ళ కోసం దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : జిల్లాలోని అన్నీ మండలాల్లోని కూరగాయల సాగు చేయు రైతులు శాశ్వత పందిళ్ళు కోసం దరఖాస్తు చేసుకోవాలని పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖ జిల్లా అధికారి జంగా కిషోర్ సోమవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. శాశ్వత పందిరి ఏర్పాటు చేసుకోవడం వలన కాయ నాణ్యత పెరుగుతుంది అని, వర్షాకాలంలో అధిక వర్షాల వలన కాయలు పాడవకుండా ఉంటాయి అని, కాయ కోత సులభతరం అవుతుందని అన్నారు. శాశ్వత పందిరి ఒకసారి వేసుకుంటే 12 నుండి 15 సంవత్సరములు వరకు దృడంగా ఉంటుంది అని, దీని ద్వారా తీగ జాతి రకాలైన బీర, సొర, కాకర, పొట్ల, దొండ, చిక్కుడు వంటి పంటలకు ఉపయోగకరం అని తెలిపారు.

ప్రభుత్వ రాయితీ వివరములు:

1. పందిరి నిర్మాణం కొరకు రాతి / సిమెంట్ / పోల్స్ 10 అడుగులు పొడవు (15 ‘x 18’) దూరం – రూ.32550 లు
2. స్టీల్ వైర్ అమర్చుటకు (8 గేజ్ & 10 గేజ్) రూ.56250 లు
3. లేబర్ ఖర్చులకు (గుంటలు తీయుట, పోల్స్ పాతు ట, వైర్ అమర్చుట) రూ.1,08,800 లు
ఒక యూనిట్ నకు రూ.1,00,000 లు 50% రాయితీ తో ఒక యూనిట్ నకు రూ.50000 లు చొప్పున ఒక్కో రైతు కు 5 యూనిట్స్ వరకు మంజూరు చేస్తామని తెలిపారు. కావున ఆసక్తి గల రైతులు శాశ్వత పందిళ్ళు కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad