– మెదక్‌లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత
– 50కిపైగా ప్రాంతాల్లో కురిసిన వాన
– నారాయణపేట జిల్లా మాగనూరులో 6.48 సెంటీమీటర్ల భారీ వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వాతావరణం చల్లబడటంతో ఆదివారం ఎండలు తగ్గుముఖం పట్టాయి. అయితే, ఉక్కపోత మాత్రం అలాగే ఉంది. నిన్నటి వరకూ పగటి పూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదైన విషయం విదితమే. ఆదివారం మాత్రం మెదక్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో ఆదివారం 40 డిగ్రీలకు లోపే నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో ఒకటి నుంచి నాలుగు డిగ్రీల మేర తగ్గాయి. మెదక్‌లో అత్యధికంగా 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. వచ్చే రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. రాష్ట్రంలో ఆదివారం రాత్రి పది గంటల వరకు 50కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా మాగనూరులో అత్యధికంగా 6.48 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. సోమ, మంగళవారాల్లో పొడివాతావరణం ఉండనున్నది. అయితే, అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసే సూచనలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. రాత్రి వేళ్లల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే సూచనలున్నాయి.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
మెదక్ 42 డిగ్రీలు
నల్లగొండ 38.5 డిగ్రీలు
ఆదిలాబాద్ 38.3 డిగ్రీలు
నిజామాబాద్ 38.2 డిగ్రీలు
భద్రాచలం 37.8 డిగ్రీలు
అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
మాగనూరు(నారాయణపేట) 6.48 సెంటీమీటర్లు
కల్లూరు తిమ్మనదొడ్డి(గద్వాల) 6.25 సెంటీమీటర్లు
కోహిర్(సంగారెడ్డి) 3.93 సెంటీమీటర్లు
మల్లాపూర్(గద్వాల) 3.85 సెంటీమీటర్లు
మల్దకల్(గద్వాల) 3.30 సెంటీమీటర్లు
కాస్త తగ్గిన ఎండలు..పలుచోట్ల వర్షాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES