Tuesday, July 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ నాయకులు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ నాయకులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ త‌న నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ నేత‌లు క‌లిశారు. ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, తదితరులు రేవంత్ రెడ్డిని క‌లిశారు. ప్రజా సమస్యలు, పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ, ఆర్టీసీతో పాటు పలు ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -