వైవిధ్యమైన సినిమాలను నిర్మించడంలో హీరో రానాకు ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలోనే ఆయన మరో సరికొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తన స్పిరిట్ మీడియా బ్యానర్‌పై ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ప్రవీణ పరుచూరిని దర్శకురాలిగా పరిచ యం చేస్తున్నారు. సున్నితమైన హాస్యంతో ఉండే లైట్ హార్ట్‌డ్ ఎంటర్‌టైనర్ ఇది. ‘కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి కల్ట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత ప్రవీణ ఈ సినిమాతో డైరెక్షన్‌లోకి అడుగు పెడుతున్నారు. ఒక సంఘటన తర్వాత ఊహించని మలుపు తిరిగిన ఒక గ్రామ యువకుడి జీవితం నేపథ్యంలో సాగుతుంది.
లాస్ ఏంజిల్స్‌కు చెందిన అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకు న్యూ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తున్నారు.
అద్భుతమైన పాటలు, డ్యాన్స్ సీక్వెన్సులు, హాస్యంతో కూడిన ఉపకథల ద్వారా ఈ చిత్రం సరికొత్త అనుభూతిని పంచబోతోంది.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అని చిత్ర బృందం తెలిపింది. ‘నేను నటించే సినిమాలే కాదు.. నిర్మించే సినిమాలు సైతం సరికొత్తగా ఉండాలని కోరుకుంటాను. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ వంటి మరో వైవిధ్యమైన చిత్రంతో రాబోతున్నాను. ఓ సంఘటన ద్వారా ఓ యువకుడి జీవితంలో ఏం జరిగింది అనే పాయింట్‌తో ఈ సినిమాని ప్రవీణ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు’ అని రానా చెప్పారు.
‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ఏం జరిగింది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES