నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలోని వీర్లపాలెం థర్మల్ పవర్ ప్లాంట్‌లోని ఫస్ట్ ఫ్లోర్ యూనిట్-1లో భారీగా మంటలు చెలరేగాయి. సోమవారం తెల్లవారుజామున బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ కాగా.. అది గమనించని వర్కర్స్ అక్కడే వెల్డింగ్ చేస్తుండగా ముందు స్వల్పంగా మంటలు వచ్చాయి. లీక్ అయిన అయిల్ కారణంగా క్రమంగా ఆ మంటలు యూనిట్ మొత్తానికి వ్యాపిస్తుండటంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సిబ్బంది సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. వచ్చే నెల పవర్ ప్లాంట్ ప్రారంభానికి అధికారులు ట్రయల్ రన్‌కు చేస్తుండగా ఇలా అకస్మాత్తుగా ప్లాంట్‌లో మంటలు చెలరేగడం గమనార్హం. ఈ ప్రమాదం కారణంగా 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం..
- Advertisement -
RELATED ARTICLES