Tuesday, July 1, 2025
E-PAPER
Homeజాతీయంఎస్సీ, ఎస్టీల్లో క్రిమీలేయర్‌ తీర్పు ఒక మైలురాయి

ఎస్సీ, ఎస్టీల్లో క్రిమీలేయర్‌ తీర్పు ఒక మైలురాయి

- Advertisement -

నా న్యాయ జీవితంలో ముఖ్య ఘట్టం : సీజేఐ జస్టిస్‌ గవాయ్‌
నాగ్‌పూర్‌:
ఎస్సీ, ఎస్టీలలో క్రీమీలేయర్‌ సూత్రాన్ని వర్తింపజేయాల్సిన అవసరాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించటం తన న్యాయ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టమని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌ అన్నారు. ఇది సామాజిక న్యాయాన్ని మెరుగుపర్చటానికి చాలా అవసరమని చెప్పారు. ”ఉన్నత హౌదాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ అధికారుల పిల్లలను నిజంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలతో సమానంగా చూసుకోవటమనేది నిశ్చయాత్మక చర్య ఉద్దేశ్యాన్ని నీరుగారుస్తుంది. క్రీమీలేయర్‌ను గుర్తించటం వల్ల ప్రయోజనాలు అర్హులైనవారికి చేరుతాయని నిర్ధారిస్తుంది” అని నాగ్‌పూర్‌ పర్యటన సందర్భంగా ఒక ఆంగ్ల వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. రిజర్వేషన్‌ ప్రయోజనాల సమాన పంపిణీని నిర్ధారించటానికి ఎస్సీ, ఎస్టీ వర్గాలలో ఉప-వర్గీకరణను అనుమతించే పిల్‌ తీర్పులో భాగంగా ఆయన పరిశీలన వచ్చింది. ఎన్నికల బాండ్లు, వాక్‌స్వేచ్ఛ వంటి సుప్రీంకోర్టు కీలక తీర్పులతో పాటు దాదాపు 300 జడ్జిమెంట్లలో ఆయన భాగమయ్యారు. ఈ ఏడాది మే 14న 52వ సీజేఐగా గవారు నియమితులైన విషయం విదితమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -