Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంరెచ్చిపోయిన ఇజ్రాయిల్‌

రెచ్చిపోయిన ఇజ్రాయిల్‌

- Advertisement -

ఆస్పత్రి, స్కూళ్ళు, ఇండ్లపై బాంబుల వర్షం
అల్‌ అక్సా ఆస్పత్రిలో విధ్వంసం
కైరో, గాజా :
గాజా వ్యాప్తంగా డజన్ల సంఖ్యలో వైమానిక దాడులకు ఇజ్రాయిల్‌ పాల్పడింది. ఆస్పత్రి, స్కూళ్ళు, ఇండ్లపై బాంబుల వర్షం కురిపించింది. మరోవైపు పెద్ద సంఖ్యలో ప్రజలను తరలిపోవాల్సిందిగా మిలటరీ ఆదేశాలు జారీ చేయడంతో పదాతిదాడులు ఉధృతమవుతాయనే భయాందోళనలు స్థానికుల్లో పెరిగాయి. ఆదివారం వందల సంఖ్యలో ప్రజలు సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్ళారు. సోమవారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాగా, సోమవారం తెల్లవారుజాము నుంచి 48మంది పాలస్తీనియన్లను ఇజ్రాయిలీ బలగాలు పొట్టనబెట్టుకున్నాయి. డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. డెర్‌ అల్‌ బాలాV్‌ాలోని అల్‌ అక్సా అమరవీరుల ఆస్పత్రిపై ఇజ్రాయిల్‌ బలగాలు దాడులు చేశాయి. ఆదివారం సాయంత్రం జరిగిన దాడిలో ఒక ఇల్లు ధ్వంసమైంది. అందులో ఆశ్రయం పొందుతున్న పదిహేను మంది నిర్వాసితులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహిళలు, చిన్నారులే సగం మంది ఉన్నారు.సుదీర్ఘకాలంగా ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఈ యుద్ధంలో గాజాలో ఇప్పటివరకు 56,531మంది మరణించారు. 1,33,642మంది గాయపడ్డారు. హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని మార్చి 18న ఉల్లంఘించిన నేపథ్యంలో జరిగిన దాడుల్లో ఇప్పటివరకు 6,203మంది పాలస్తీనియన్లు మరణించారు. 21,601మంది గాయపడ్డారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad